'జై లవకుశ' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్స్ ,ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోన్నప్పటికీ, ఒక వైపు సినిమాని ఎన్టీఆర్ కెలికేశాడంటూ రూమర్స్ వస్తున్నాయి. అలా వస్తున్న రూమర్లకు ఎన్టీఆర్ చెక్ పెట్టేశాడనిపిస్తోంది. దేవుడి దయవల్ల నటన అబ్బింది. అదొక్కటే నాకు తెలుసు. ఎవరి పనిలోనూ వేలు పెట్టను. నిర్మాత నా అన్నయ్యే అయినా, నిర్మాణ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదు. నా పని నటించడం మాత్రమే. అదే పెర్‌ఫెక్ట్‌గా చెయ్యాలనుకుంటాను.. అంటూ అలా అనుకుంటున్న వాళ్లకి స్ట్రెయిట్‌గా సమాధానం ఇచ్చేశాడు ఎన్టీఆర్. బాబీ మంచి రచయిత, దర్శకుడు. ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంటాడు బాబీ. బాబీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా 'జై లవకుశ' మంచి సినిమా అవుతుంది.. అని ఎన్టీఆర్ సినిమాపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ అన్నదమ్ముల అనుబంధంపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉంది. క్యారెక్టర్స్ సంగతి పక్కన పెడితే, కథపై నమ్మకంతోనే ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగిందనీ ఆయన అంటున్నారు. సినిమా విజయం సంగతి ఎలా ఉన్నా, మంచి కథని చూపించార్రా అన్న ఒక్క మాట తృప్తినిస్తుందంటున్నాడు ఎన్టీఆర్. వసూళ్ళ గురించి ఆలోచించడంలేదు. కానీ 'జై లవకుశ' ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని మాత్రం చెబుతున్నారు ఎన్టీఆర్.