నందమూరి కళ్యాణ్‌రామ్ తమ్ముడు ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్, మార్కెటింగ్ వ్యవహారాల్లో కళ్యాణ్‌రామ్ పక్కా ప్రణాళికలతో ఉన్నాడట. ఏ సినిమాకైనా సినిమా ప్రమోషనే కీలకం. అత్యధిక ధియేటర్స్‌లో విడుదల దగ్గర్నుంచీ, సినిమాని ప్రమోట్ చేసే విధానం వరకూ అన్నీ కార్యకలాపాలు సినిమాపై హైప్ క్రియేట్ అవ్వడానికి దోహదపడే అంశాలవుతాయి. కళ్యాణ్‌రామ్‌కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. అందుకే ఈ సినిమా విషయంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ వరుస సక్సెస్‌ల మీదున్నాడు. అందుకే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కి ముందు దాదాపు రెండు మూడు వారాల పాటు పూర్తిగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించాలని కళ్యాణ్‌రామ్ అనుకుంటున్నాడట. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌తో పాటు చిత్ర టెక్నికల్ యూనిట్ కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననుందట. మీడియాలో అందరూ కనిపించనున్నారట. మీడియాలో సినిమా యూనిట్ కనిపించి అలా సందడి చేస్తే చాలా ఎగ్రసివ్‌గా ఉంటుంది. సినిమాకి కావాల్సినంత హైప్ పెరుగుతుంది. అలాగే ఆన్‌లైన్ పైరసీలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారట. ఇప్పటికే ఆన్‌లైన్ పైరసీ విషయమై కళ్యాణ్‌రామ్ గవర్నమెంట్‌కి ఫిర్యాదు చేశారు. టీజర్ లీకేజీ దృష్ట్యా సినిమా విషయంలో అలా జరగకూడదని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నిర్మాత కళ్యాణ్‌రామ్. ఇకపోతే రేపు అభిమానుల నిమిత్తం 'జై లవకుశ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ సందర్భంగా రేపు ట్రైలర్ విడుదల చేస్తారు.