ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జై లవకుశ'. ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది ఈ సినిమాకి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుగుతోందట 'జై లవకుశ' సినిమాకి. ఇప్పటికే వంద కోట్లని టచ్ చేసేసిందని టాక్ వినిపిస్తోంది. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అదే కాక టీజర్ వచ్చాక ఈ అంచనాలు పదింతలయ్యాయి. టీజర్ యూ ట్యూబ్‌లో సృష్టించిన సంచలనాలకి డిస్ట్రిబ్యూటర్స్ నుండి, శాటిలైట్ రైట్స్ వరకూ రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందిన చెప్పుకుంటున్నారు. అంతేకాదు లేటెస్టుగా బుల్లితెరపై ప్రసారం అవుతోన్న 'బిగ్‌బాస్' షోలో ఎన్టీఆర్ అప్పియరెన్స్‌కి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది కూడా ఎన్టీఆర్ పరోక్షంగా సినిమా ప్రమోషన్‌కి తోడవుతోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న నివేదా థామస్ ఈ మధ్యే 'నిన్ను కోరి' సినిమాతో హిట్ కొట్టింది. ఆ రకంగానూ పోజిటివ్ వైబ్స్ ఈ సినిమాకి బాగా యూజ్ అయ్యేలా ఉన్నాయి. మరో హీరోయిన్ రాశీఖన్నా ఎన్టీఆర్‌తో జోడీ కడుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ తొలి సారిగా ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్న సినిమా ఇది. కళ్యాన్‌రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందుతోంది.