యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'జై లవకుశ'. ఈ సినిమాలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు గెటప్స్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడింట్లోనూ 'జై' పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందని సమాచారమ్. ఈ పాత్రకే హీరోయిన్ ఉంటుందనే గాసిప్స్ వినవస్తున్నాయి. అదేంటి మూడు పాత్రలు, ఇద్దరే హీరోయిన్లు కదా. అయినా జై పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. దాదాపుగా సినిమాకి విలన్ ఆ పాత్ర. సో ఆ పాత్రకి హీరోయిన్ ఉండదనే ఇంతవరకూ అందరూ అనుకుంటున్నారు. అయితే లేటెస్ట్ సమాచారమ్ ప్రకారం ఆ పాత్రకే హీరోయిన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రాశి ఖన్నా, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లు. అయితే ఈ ఇద్దరూ ఎవరి సరసన నటిస్తున్నారన్నదీ ప్రస్తుతానికి క్లారిటీ లేదు. జై లేదా లవ సరసనే ఈ ఇద్దరూ నటించనున్నట్లు కొన్ని ఫొటోల్ని బట్టి అర్థమవుతోంది. అన్ని ఫొటోల్లోనూ జై పాత్రకే రాశి, నివేదా హీరోయిన్గా కనెక్ట్ అయినట్లూ అనిపిస్తోంది. స్టిల్స్‌లో ఈ కన్ఫ్యూజన్ ఏంటో కానీ, ఈ సస్పెన్స్ సినిమాపై అంచనాల్ని అయితే భారీగా పెంచేస్తోంది. ఇంకో వైపున మూడు పాత్రలకీ సమాన ప్రాధాన్యత దక్కుతుందనే వార్తలు వినవచ్చినా, 'జై' పాత్రను ఎక్కువ ఎలివేట్ చేశారని తాజాగా గాసిప్స్ వినవస్తున్నాయి. ఏది ఏమైనా టోటల్‌గా ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. చిరంజీవి తర్వాత ట్రిపుల్ రోల్లో నటిస్తున్న హీరో ఎన్టీఆర్. అందులోనూ ఒకటి విలన్ పాత్ర. సో ఏ రకంగా చూసినా ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అంతే!