నా పేరు విజయ్ దేవరకొండ అని తాజాగా చెప్పుకున్నాడు 'పెళ్ళిచూపులు', 'అర్జున్‌రెడ్డి' చిత్రాల హీరో విజయ్ దేవరకొండ. చిన్నప్పుడు విజయ్ సాయి అని రాసుకునేవాడట. విజయ్ దేవరకొండ అని రాస్తే టీచర్ కొట్టేదట. ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు పేరు రాసుకోవచ్చంటూ పేర్కొన్నాడు. హిట్టు కొట్టాడు గనుక విజయ్ దేవరకొండ ఏం చెప్పినా, ఏం చేసినా చెల్లిపోతుంది. యంగ్ హీరో ఆకాష్ కెరీర్ సరిగ్గా లేక తన పేరుని ఎడా పెడా మార్చేశాడు. హీరోయిన్లు కూడా అంతే. హిట్ కొడితే ఓకే. లేదంటే మరో రకం. ఒక్కోసారి పేరు కూడా కలిసొస్తుంది. సినీ రంగంలో పేరు మార్చుకోవడం చాలా కామన్. స్టార్ హీరోలు కూడా అలా పేర్లు మార్చుకున్నవారే. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక శివ శంకర వర ప్రసాద్ అనే పేరును చిరంజీవిగా మార్చుకుని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా టాలీవుడ్లో నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా పేరు మార్చుకున్నాడు కాబోలు. అయితే హిట్టొచ్చాక తన పేరుని ఇంకొంచెం గట్టిగా చెబుతున్నాడు, మార్చేసుకున్నట్టుగా. అయితే 'పెళ్ళిచూపులు', అంతకు ముందు నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలోనూ విజయ్ దేవరకొండగానే టైటిల్స్‌లో అతని పేరు పడింది. అర్జున్ రెడ్డి వరకూ ఇదే పేరు కంటిన్యూ అయ్యింది. ఇకపై సినిమాల్లో విజయ్ దేవరకొండ మార్చుకున్న పేరు టైటిల్స్‌లో రానుందన్న మాట.