ఊహించని పరిణామాలతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం మహాకూటమి పార్టీ అభ్యర్ధిగా నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని పోటీ చేస్తున్న విషయం విదితమే.
ఇక ఆమె అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఉదయం బాలకృష్ణ ఆమెని గెలిపించాల్సిందిగా ఓటర్లని కోరగా కొద్దిసేపటి క్రితం ఆమె సోదరులు హరికృష్ణ కుమారులు అయిన కళ్యాణ్ రామ్ & ఎన్టీఆర్ లు సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటన ద్వారా తమ సోదరికి తమయొక్క సంపూర్ణ మద్దతు ఉందని తెలియచేశారు. ఏదేమైనా... సుహాసిని బరిలో నిలవడంతో ఒక్కసారిగా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.