అంజలి- అచ్చ తెలుగు అమ్మాయి. తమిళంలో ముందుగా పేరు తెచ్చుకున్నా తరువాత తెలుగులోను అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి.
అయితే గత కొంతకాలంగా తెలుగు సినిమాలు బాగా తగ్గించేసి తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నది. దీనికి ఒక ప్రధాన కారణం ఆమె తమిళ హీరో జైతో ప్రేమలో ఉన్నట్టు బయటకి వినిపించిన మాట. అయితే వీరు బయట తరచు కనపడుతుండడం అలాగే ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళుతుండడంతో వీరు ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అని అంతా అనుకున్నారు.
అయితే అలా అనుకుంటున్న వారందరికీ పెద్ద షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. తాను నటించిన తాజా చిత్రం బెలూన్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడగగా- అసలు తనకి పెళ్ళి ఆలోచన మనసులోనే లేదని చెప్పింది.
మరి హీరో జైతో ప్రేమ సంగతేంటి అని అడగగా- అది కేవలం ఒక పుకారు మాత్రమే. తనకి అత్యంత సన్నిహితుల్లో హీరో జై కూడా ఒకడు అంతే తప్ప తమ మధ్య బయట ఊహించుకుంటున్నట్టుగా ఏమిలేదు అని కుండబద్దలు కొట్టేసింది.
ఇంతకి అంజలి నిజం చెప్పిందా లేక తెలివిగా టాపిక్ ని పక్కకి తప్పించిందా అన్నది కాలమే నిర్ణయించాలి.