ఎన్టీఆర్ మౌనం విడాల్సిందే!

By iQlikMovies - June 04, 2020 - 13:26 PM IST

మరిన్ని వార్తలు

అభిమానులే తార‌ల బ‌లం. అభిమానుల అంచ‌నాల్ని అందుకోవ‌డానికే హీరోలు తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. వాళ్ల కోస‌మే ఆలోచిస్తుంటారు. అయితే... ఆ అభిమానులు హీరోల బ‌ల‌హీన‌త మాత్రం కాకూడ‌దు. అభిమానులుహ‌ద్దులు దాటుతున్న‌ప్పుడు వాళ్ల‌ని దారిలోకి తేవాల్సిన బాధ్య‌త త‌ప్ప‌కండా హీరోల‌దే. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ ప‌నికి పూనుకోవాలి. మీరా చోప్రా ఉదంతంతో అభిమానుల వెర్రిత‌నం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. `ఎన్టీఆర్ - మ‌హేష్‌బాబుల‌లో ఎవ‌రు ఇష్టం` అనే ప్ర‌శ్న‌కు `మ‌హేష్ బాబు` అని సమాధానం చెప్పినందుకు మీరా చోప్రాని ఆడేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

 

అయితే అది కూడా హ‌ద్దుల్లో ఉంటే బాగుండేది. మీరాని పోర్న్ స్టార్‌గా అభివ‌ర్ణిస్తూ.. బండ బూతులు తిడుతున్నారు. మీరా త‌ల్లిదండ్రుల‌కు ఫోన్లు చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతున్నార్ట‌. ఈ విష‌యంలోనే మీరా చోప్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తార‌క్‌ని స్పందించాల్సిందిగా కోరింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ విష‌యమై ఎన్టీఆర్ మాట్లాడ‌లేదు. త‌న అభిమానుల్ని శాంతించ‌మ‌ని కోర‌లేదు. ఆడ‌వాళ్ల గొప్ప‌ద‌నం గురించి కెమెరా ముందు లెక్చ‌ర్లు దంచే హీరోలు.. ఇలాంటి విష‌యంలోనూ అంతే ధీటుగా స్పందిస్తే బాగుంటుంద‌న్న‌ది అంద‌రి మాట‌. ఓ ఆడ‌దాన్ని అభిమానులు కించ‌ప‌రుస్తుంటే ఎన్టీఆర్ కూడా చూస్తూ కూర్చోకూడ‌దు. మౌనం వీడాల్సిందే. ఎన్టీఆర్ కూడా త్వ‌ర‌లోనే స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అది వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే బాగుంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS