ఈరోజు అనగా మే 20న ఎన్టీఆర్ తన 35వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఇక పోయిన ఏడాది లానే ఈ ఏడాది కూడా సరిగ్గా అర్దరాత్రి 12 గంటలకు తన కొడుకుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే పోయిన ఏడాదికి ఈ ఏడాది వచ్చిన మార్పు ఏంటంటే- నా కొడుకు తన కళ్ళని మూయడంలేదు అని చెబుతూ, తన కొడుకు పెద్దవాడైపోయాడు అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. ఇక రాత్రి 12 గంటల సమయంలో ఆయనకి పుట్టినోజు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వచ్చి విషెస్ చెప్పి వెళ్ళారు.
ఇదిలావుండగా నిన్ననే ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన త్రివిక్రమ తో చేస్తున్న చిత్రం టైటిల్ (అరవింద సమేత) ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సిక్స్ ప్యాక్స్ తో తారక్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి.
ఈ పుట్టినరోజు కి తన అభిమానులకి మంచి గిఫ్ట్ లాంటి లుక్ ఇవ్వడంతో ఆయన రాబోయే చిత్రం పైన ఒకింత అంచనాలు పెరిగిపోయాయి.