టార్గెట్ 2019: పవన్ కళ్యాణ్

By iQlikMovies - May 20, 2018 - 12:43 PM IST

మరిన్ని వార్తలు

సినీ నటుడు నుండి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి జనసేన పోరాట యాత్రకి శ్రీకారం చుట్టాడు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యాత్ర ని ప్రారంభించాడు పవన్. తొలుత సముద్రం ఒడ్డున గంగమ్మ పూజ చేసి ఆయన ఈ యాత్రని మొదలుపెట్టాడు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో తన గమ్యం ఏంటో స్పష్టంగా వివరించి చెప్పేశాడు.

 

అదేంటి అంటే- పెద్దల ఆశీస్సులు, యువత మద్దతుతో, అక్క చెల్లెళ్ళ తోడుతో 2019కి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము.
ఇక ఈ ప్రకటనతో ఆయన కార్యకర్తలు, అభిమానుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కాకుండా తన ప్రయాణం ఎలా ఉండబోతున్నది అని కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 

మరి ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి పెను మార్పులు రానున్నాయో అన్నది చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS