ఎన్టీఆర్-చరణ్ లతో మరో ‘బాహుబలి’ తీయనున్న జక్కన్న

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీయనున్న చిత్రానికి సంబందించిన ఒక తాజా సమాచారం బయటికొచ్చింది. ఆ సమాచారం ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారిపోయింది.

ఇంతకి ఆ విషయం ఏంటి అంటే- రాజమౌళితో బాహుబలి 1 & 2 చిత్రాలకి పనిచేసిన సాంకేతిక వర్గం మొత్తాన్ని తన రాబోయే చిత్రానికి కూడా తీసుకున్నాడట. దీనితో సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, ఛాయాగ్రహణం, కథ ఇలా దాదాపు ముఖ్య శాఖలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇదిలావుండగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనులలో రాజమౌళి & కో ఇప్పటికే తల మునకలై ఉన్నారు అని తెలుస్తున్నది. త్వరలోనే ఇద్దరు హీరోలకి స్క్రిప్ట్ మొత్తం రాజమౌళి వినిపిస్తారు అని సమాచారం.

మరి తనతో బాగా పనిచేసే అలాగే కలిసొచ్చిన టీంని మళ్ళీ రిపీట్ చేస్తున్న రాజమౌళికి ఇది మరో బాహుబలి కానుందా అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS