మే 20.. ఎన్టీఆర్ జన్మదినం. ప్రతీ యేటా మే 20 వస్తోదంటే ఎన్టీఆర్ అభిమానులు సంబరాలకు సిద్ధం అయిపోతారు. ఎన్టీఆర్ తాజా చిత్రం నుంచి స్టిల్లో, టీజరో బయటకు వస్తుంది. అయితే ఈసారి అలాంటి హంగామా ఏమీ లేదు. ఎందుకంటే ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. దానికీ ఓ బలమైన కారణం ఉంది.
ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన చనిపోయి యేడాది కూడా కాలేదు. అందుకే పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయన మే 20న కుటుంబ సభ్యుల సమక్షంలోనే గుడుపుతారని, నందమూరి హరికృష్ణ సమాధిని సందర్శించి, నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమాకి సంబంధించి ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎన్టీఆర్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తాజా నిర్ణయంతో... అవన్నీ ఆవిరి అయినట్టే.