మొన్న 'మెడ్‌గలా' ఈవెంట్‌కి సంబంధించి దేశీ గాళ్ ప్రియాంకా చోప్రా డ్రస్సింగ్ విషయమై వచ్చిన కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియా వేదికగా ప్రియాంకాని ఆడిపోసేసుకున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ప్రియాంకా డ్రస్సింగ్ స్టైల్‌ని మార్ఫింగ్ చేసి, ఎంజాయ్ చేశారు.
ఆర్జీవీ కూడా ప్రియాంకా హెయిర్ స్టైల్‌ని బిన్ లాడెన్ మీసకట్టు కింద అమర్చి అదేదో ఆనందం అంటారు కదా.. అది పొందారు. అయితే, తాజాగా ప్రియాంకా స్టైల్ చూసి అహో, ఓహో అంటున్నారు. తాజాగా కేన్స్‌లో ప్రియాంకా డిఫరెంట్ స్టైలింగ్‌లో మెరిసింది. మెరూన్, బ్లాక్ తదితర రంగలు మిక్సింగ్ కలర్ డ్రస్సులో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. బీభత్సమైన హాట్‌నెస్‌తో పాటు, ఆకట్టుకునే అందంతోనూ మెరిసిపోయింది. ఆఫ్టర్ పార్టీలో వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో మెరిసింది. ఎక్స్‌పోజింగ్ అంతకుమించిన పాళ్లలో ఉన్నా, ప్రియాంకా స్టైలింగ్‌కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటి నెగిటివ్ కామెంట్స్ తాజా పోజులతో రీప్లేస్ చేసినట్లుంది ప్రియాంకా చోప్రా. దటీజ్ దేశీ గాళ్.. అంతే. ఫ్యాషన్ రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చిన ప్రియాంకా స్టైల్ విషయంలో ఎప్పుడూ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా కనిపించాలనే అనుకుంటుంది.
అందులో భాగంగానే అప్పుడప్పుడూ ఆ డోస్ కాస్త ఓవర్ అయితే మొన్నటి మెడ్‌గలా ఇష్యూలా వైరల్ అవుతుందంతే. అయినా మెడగలా ఈవెంట్‌కి అలానే వెళ్లాలి. క్వైట్ డిఫరెంట్ అనిపించుకోవాలి. అదే చేసింది ప్రియాంకా. కానీ, ఇప్పుడు కేన్స్‌లో చూశారుగా ప్రియాంకా స్టైల్ ఏంటో.