ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'జై లవ్ కుశ'. ఇంత వరకూ ఈ టైటిల్‌పై కొన్ని అనుమానాలున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి ఈ టైటిలే యాప్ట్ అని ఆఫీషియల్‌గా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యాణ్‌రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా చాలా రిచ్‌గా ఉండేలా సినిమాని రూపొందిస్తున్నారట. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తున్నారు. వారిలో రాశీఖన్నా, నివేదా థామస్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ముద్దుగుమ్మ కోసం వెతుకులాట జరుగుతోంది. ఈ సినిమాలోని ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. అందుకోసం హాలీవుడ్ నుండి ప్రముఖ మేకప్ టెక్నీషియన్స్‌ని ఇండియాకి రప్పించారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా ఇది. అందుకే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారట. అలాగే ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ కోసం బాగా బరువు తగ్గారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదో ప్రయోగాత్మక చిత్రమనే చెప్పాలి.