యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' బిగ్ బాస్ షో లో తీసుకునే రెమ్యునరేషన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ షో మొత్తం పదివారాల పాటు సాగుతుంది. ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో మాత్రమే బుల్లి తెరపై కనిపిస్తాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వారానికి 70 లక్షలు ఛార్జ్ చేస్తాడు. అంటే రోజుకి 35 లక్షలు. దీని ప్రకారం 'బిగ్ బాస్' కి ఎన్టీఆర్ తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాలా 7 కోట్లు.
ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ ఇమేజ్ ప్రకారం చూస్తే ఇది అంత ఎక్కువేమీ కాదని, మామూలు మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని తెలుస్తుంది. 'బిగ్ బాస్' ని ఎన్టీఆర్ హోస్ట్ చేసే విధానం చూస్తుంటే మొదట్లో కంటే రోజు రోజుకి తన మాటలతో షో ని రక్తి కట్టిస్తున్నాడు. స్టార్ మా ఛానల్ వారు కూడా ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా తాము ఇచ్చేది తక్కువే అని భావిస్తున్నారు.
ఎన్నో ఏళ్ల తర్వాత 'స్టార్ మా' ని నెంబర్ వన్ గా నిలబెట్టిన ఎన్టీఆర్ కి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పుకోవచ్చు.