ఏ తండ్రికైనా తన బిడ్డలంటే ఎనలేని ప్రేమ. ఈ విషయంలో ఏ తండ్రిని కదిలించినా, తండ్రులందరికీ పిల్లలంటే ప్రేమ ఎక్కువేననీ, తనకు ఇంకొంచెం ఎక్కువని చెబుతుండడం మామూలే. ఎన్టీయార్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎన్టీయార్‌కి తన కుమారుడు అభయ్‌రామ్ అంటే ఎంతో ఎంతో ఎంతో ఇష్టం. పుత్రోత్సాహాన్ని ఎన్టీయార్ భలేగా ఎంజాయ్ చేస్తుంటాడు. తండ్రి, కొడుకు ఒకే ఫ్రేమ్‌లో ఫొటోలో కన్పిస్తేనే అభిమానులు ఊగిపోతారు. మరి, ఎన్టీయార్, అభయ్‌రామ్ కలిసి తెరపై కన్పిస్తేనో? ఎన్టీయార్ తనయుడు అభయ్‌రామ్, 'బిగ్‌బాస్'లో కనిపించబోతున్నాడేమో! తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఎన్టీయార్ ఎలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాడోగానీ, ఈ రోజైతే ఎన్టీయార్ బిగ్‌బాస్ రియాల్టీ షోలో కనిపించాల్సి ఉంది. అలాగే తన కుమారుడి పట్టినరోజున బిగ్‌బాస్ సెట్‌లో అభయ్‌రామ్‌తో కలిసి ఉన్న ఫొటోని ఎన్టీయార్ షేర్ చేయడంతో అభిమానులు, బిగ్‌బాస్‌లో అభయ్‌రామ్ కనిపిస్తాడని ఆశిస్తున్నారు. 'నా సంతోషం పుట్టినరోజు' అని ఎన్టీయార్, అభయ్‌రామ్ పుట్టినరోజు గురించి చెప్పాడు. ఇంకో వైపున తనకు ప్రియమైన స్నేహితుడు అభయ్‌రామ్ అని ఎన్టీయార్‌తో 'జనతాగ్యారేజ్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నాడు.