ఎన్టీఆర్ కెరీర్ లో రీమేక్ సినిమాల కన్నా స్ట్రెయిట్ సినిమాలే ఎక్కువ. కాని ఎందుకో తారక్ ఈ మధ్య విడుదల అయిన ఓ కన్నడ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ లోగుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజ కుమార చిత్రం అక్కడ ఘనవిజయం సాదించింది. అయితే తారక్-పునీత్ ల మధ్య స్నేహం మనందరికీ తెలిసిందే అలాగే ఈ మధ్యనే పునీత్ సినిమాలో ఒక పాట కూడా జూనియర్ పాడిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు తన స్నేహితుడి సినిమాని మన వాళ్ళ కోసం రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చిందట. అయితే జై లవ కుశ చిత్రం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే ఖరారయింది.
మరి ఈ రీమేక్ చిత్రం ఎప్పుడు పట్టాలేక్కనుందో?