హాట్ భామ పూజా హెగ్దేకి అందంతో పాటు అభినయం కూడా బాగానే వచ్చు. తొలి సినిమా 'ముకుందా'కే ఈ విషయం ప్రూవ్ చేసుకుందీ బ్యూటీ. అయితే 'డీజె'తో పూజా హెగ్దేకి హాట్ బ్యూటీగా మంచి పేరొచ్చింది. పేరుతో పాటు, పాపులారిటీ కూడా వచ్చేసింది. ఆ పాపులారిటీతోనే వరుస పెట్టి స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంది. ప్రస్తుతం పూజా హెగ్దే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పూజా కాస్త ఎక్కువగానే కష్టపడుతోందట.
ఆ మాటకొస్తే, ప్రతీ సినిమాకీ పూజా అంతే డెడికేటెడ్‌గా వర్క్ చేస్తుందట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించడం కోసం మరింత కష్టపడుతోందనీ తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ కష్టమంతా ఎందుకంటే, డాన్సుల కోసమట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొన్ని స్పెషల్ డాన్సులు కంపోజ్ చేయించుకుంటున్నాడట. బరువు తగ్గి, స్లిమ్‌గా మారిన ఎన్టీఆర్ డాన్సులు కూడా ఇరగదీసేయనున్నాడట ఈ సినిమాలో. అందుకే పూజా కొంచెం కష్టపడి, ఆ టిపికల్ స్టెప్స్‌ని ప్రాక్టీస్ చేస్తోందట.
ఎన్టీఆర్ దగ్గరుండి పూజాకి సూచనలు, సలహాలు ఇస్తున్నాడట. చెప్పింది చెప్పినట్లుగా ఫాలో చేస్తున్న పూజా టాలెంట్‌కి ఎన్టీఆర్ షాక్ తింటున్నాడట. లేటెస్టుగా 'రంగస్థలం'లో 'జిగేల్ రాణీ' పాట కోసం జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పూజా డాన్సులు ఇరగదీసేసింది. ఆల్రెడీ 'డీజె'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పోటీ పడి డాన్సులేసింది.
మరోవైపు స్పీడ్ డాన్సర్ బెల్లంకొండతోనూ 'సాక్ష్యం' సినిమాలో ఫాస్ట్ బీట్ డాన్సులు చేసేసిందట పూజా. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఆడి పాడే అవకాశం వచ్చింది. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది . ఈ షెడ్యూల్‌లో తాజాగా ఎన్టీఆర్‌తో పాటు, పూజా హెగ్దే కూడా జాయిన్ అయ్యింది.