టాలీవుడ్‌లోని ప్రముఖులపై అనుచిత ఆరోపణలు చేసి వివాదాల్లోకెక్కిన శ్రీరెడ్డి ఎట్టకేలకు ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న దాదాపు 28 మంది మీద శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదులో ముఖ్యంగా 'తిట్టారు' అన్నదే ప్రధాన ఆరోపణ. అయితే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టింది కాబట్టి, ఈ వివాదదంలో పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన శ్రీరెడ్డిపై ఆల్రెడీ పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిర్యాదులు చేశారు.
ఆ ఫిర్యాదులపై పోలీసులు ఇంకా చర్యలు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో శ్రీరెడ్డి ఈ కేసును పట్టుకుంటే, అటు నుండి ఆ కేసులు కూడా మూవ్ అయ్యే అవకాశాలు లేకపోలేవు. ఈ తరుణంలో శ్రీరెడ్డి, తనను దూషిస్తున్నారంటూ పవన్ అభిమానులే కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు. వారిపై పెట్టిన ఫిర్యాదులు ఎంత మేర ఫలిస్తాయి? పోలీసులు వాటిని అసలు పరిగణలోనికి తీసుకుంటారా? అనేది ప్రస్తుతం నెలకొన్ని ప్రశ్న. ఎటు నుండి ఎటు చూసినా, శ్రీరెడ్డి వ్యవహారం జస్ట్ పబ్లిసిటీ స్టంట్‌గానే కనిపిస్తోంది.
కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి మొదలెట్టిన ఉద్యమం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత ఆమె చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఏవీ ఫలించలేదు. ఆరోపణలైపోయాయి. ఇప్పుడు ఫిర్యాదులు మొదలయ్యాయి. చూడాలిక ఈ పర్వం ఎంత దూరం సాగుతుందో.!