చిన్న వయసులోనే కెరీర్‌లో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించేసిన యంగ్ టైగర్ ఎన్టీయార్ మధ్యలో వరుస ఫ్లాప్స్ చవిచూశాడు. దాంతో హిట్ కోసం పరితపించాల్సి వచ్చింది. కష్టం వృధా పోలేదు. ముందు 'టెంపర్', ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో', ఆ వెంటనే 'జనతా గ్యారేజ్' ఇలా వరుస హిట్స్ దక్కాయి. అంతే ఎన్టీయార్ కెరీర్ మళ్ళీ అత్యున్నతస్థాయికి చేరుకుంది. సినిమా వసూళ్ళేనా? అవార్డులూ ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. 'టెంపర్'కి చాలా అవార్డులొచ్చాయి. 'నాన్నకు ప్రేమతో' సినిమాకీ అవార్డులు పోటెత్తుతున్నాయి. 'జనతా గ్యారేజ్' సంగతి సరే సరి. లేటెస్ట్‌గా 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటనకుగాను ఇంకో అవార్డ్ ఎన్టీయార్‌ని నటించింది. అదే సైమా పురస్కారం. వరుసగా అవార్డులు ముంచెత్తుతుండడంతో ఎన్టీయార్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అవార్డులు నటుడిగా బాధ్యతను పెంచాయని మరింత హుందానంత ప్రదర్శిస్తున్నాడాయన. ఒక సినిమా ఇచ్చిన సక్సెస్‌తో, రెట్టించిన ఉత్సాహం మరో సినిమాకి చూపిస్తోంటే, ఆ సినిమా ఇచ్చే కిక్, మరో సినిమా సక్సెస్‌కి కారణమవుతోంది. అలా ఇప్పుడు ఎన్టీయార్ వెయ్యేనుగుల బలంతో 'జై లవకుశ' సినిమాకి పనిచేస్తున్నాడు. ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు ఎన్టీయార్. ఇదైతే నట విశ్వరూపమేనట. అసలు సిసలు అవార్డుల జాతర అంటే ఏంటో 'జై లవకుశ' తర్వాత చూడొచ్చునని ఎన్టీయార్ అభిమానులు భావిస్తున్నారు.