జూలీ 2 చిత్రం టీజర్ తోనే అందరిని షాక్‌కి గురి చేయగా ఇక ఈ మధ్యనే విడుదలైన జూలీ 2 ట్రైలర్ అందరిలోనూ ఈ చిత్రం పైన ఆసక్తిని రెట్టింపు చేసింది.
వివరాల్లోకి వెళితే, జూలీ 2 చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తయింది. అయితే అందరు ఊహించని విధంగా ఈ చిత్రం సెన్సార్ వద్ద ఎటువంటి ఇబ్బందులకి గురవ్వకుండా ఒక్క సన్నివేశానికి కూడా కత్తెర పడకుండా బయట పడింది. అయితే శృంగార సన్నివేశాలున్న నేపధ్యంలో ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ ని ఇవ్వడం జరిగింది.
మొత్తానికి జూలీ 2 చిత్రం అంచనాలకు భిన్నంగా ఎటువంటి అడ్డంకులు లేకుండానే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇక ఈ చిత్ర నిర్మాత వివాదాస్పదుడైన మాజీ సెన్సార్ బోర్డు చైర్మన్ పెహ్లాజ్ నేహ్లాని కావడం విశేషం.
ఇక ప్రేక్షకులు లక్ష్మి రాయి కోసం జూలీ 2 చిత్రం చూడాల్సిందే.