ఏక్తా కపూర్ నిర్మించే సినిమాలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. ఓ మహిళ ఇలాంటి సినిమాలు నిర్మిచడం ఏంటి? అని ఆమెకి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు నడిచాయి. కానీ ఆమె ఎప్పుడూ లెక్క చేయలేదు అలాంటి విమర్శల్ని. నేను ఎలాంటి సినిమాలు చేయాలో నాకు తెలుసు అంటూ డేరింగ్‌గా చెప్తూ ఉంటుంది ఏక్తా కపూర్. అలాంటి ఏక్తా కపూర్ ఈసారి మరో హాట్ అండ్ సెక్సీ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తోంది. అదే 'రాగిని ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్'. హీరో ఎవరన్న దానికన్నా హీరోయిన్ ఎంత బోల్డ్‌గా నటించింది అన్నదే ఇంపార్టెంట్. హీరోయిన్గా నటిస్తోన్న బ్యూటీ పేరు కరిష్మా శర్మ. ఇంతకు ముందెన్నడూ వెండితెరపై ఎవ్వరూ చేయలేనంత బోల్డ్ షో ఈ ముద్దుగుమ్మ చేసేసింది. దానికి నిదర్శనం ఈ ఫోటో. ఈ లుక్‌తో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్‌కి గురైంది. ఇంతకు ముందు 'రాగిణి ఎంఎంఎస్', 'రాగిణి ఎంఎంఎస్-2' సినిమాలొచ్చాయి ఏక్తాకపూర్ నుంచి. ఆ రెండు సినిమాల్లో హీరోయిన్లు బోల్డ్ షో చేసినా ఈ వెబ్ సిరీస్ స్థాయిలో బోల్డ్నెస్ ఆ సినిమాల్లో ఉండకపోవచ్చేమో. సినిమాకి సెన్సార్ వుంటుందేమోగానీ, వెబ్‌సిరీస్‌కి అలాంటిదేమీ వుండదు. ఆ లెక్కన ఈ వెబ్‌సిరీస్ ఎవరూ ఊహించనంత హాట్‌గా ఉండబోతోందనుకోవచ్చు. 'రాగిణి 2'లో సన్నీలియోన్ నటించింది. అప్పట్లో ఆ సినిమా కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చారట. సన్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడీ 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' ఇండియన్ పోర్న్ సినిమా అనదగ్గ స్థాయిలో ఉండబోతోందట.