స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి.. ఈ సినిమాలు రాసింది త్రివిక్రమ్. తీసింది కె విజయ భాస్కర్. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకొచ్చిన విజయ భాస్కర్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అవకాశం అందుకున్నారు. అయితే జై చిరంజీవ నిరాశ పరిచింది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత విజయ్ భాస్కర్ వేగం తగ్గింది.
2013లో చేసిన మసాలా సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు విజయ భాస్కర్. అయితే ఇప్పుడాయన మరోసారి కెప్టెన్ చైర్ లో కూర్చుంటున్నారు. ఆయన దర్శకత్వంలో గుంటూరు రామకృష్ణ నిర్మాతగా ఒక సినిమా రాబోతుంది. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెడతారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుందని తెలుస్తోంది.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ లు విజయ్ భాస్కర్ కి బాగా కలిసొచ్చిన జోనర్. మరి సెకండ్ ఇన్నింగ్ ఆయనకి పూర్వవైభవం తేవాలనే ఆశిద్దాం.