హ్రితిక్ రోషన్ కొత్త చిత్రం కాబిల్ ఈ సంవత్సరపు పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలవబోతుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో బలం పేరుతో డబ్ కూడా చేశారు.
ఆల్రెడీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగుడుతుంది. ఇదే క్రమంలో కాబిల్ ఈ రోజు నుండి మన దాయాది దేశం అయిన పాకిస్తాన్ లో ప్రదర్శించబడనుంది. ఈ మధ్యనే పాకిస్తాన్ థియేటర్ల సంఘం ఇండియా చిత్రాల ప్రదర్శన పై చేసిన తాత్కాలిక బ్యాన్ ని తొలగించారు. నిషేధం తొలిగిన తరువాత విడుదల కాబోతున్న తోలి భారతీయ చిత్రం కూడా కాబిల్ కావడం విశేషం.
చిత్ర నిర్మాత అయిన రాకేశ్ రోషన్ కూడా ఈ విషయాన్ని ద్రువికరించారు. అయితే షారుఖ్ చిత్రం రైజ్ కూడా పాకిస్తాన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీవర్గాల సమాచారం.
మొత్తానికి రెండు దేశాల మధ్య సంబందాలు ఎలా ఉన్నా సినిమాల విషయంలో మాత్రం పట్టు సడలినట్టే కనిపిస్తుంది.