2016లో వచ్చిన హిట్ సినిమాల్లో జయమ్ము నిశ్చయమ్మురా ఒకటి. యంగ్ డైరెక్టర్ శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్యాప్షన్ కి తగ్గట్టుగానే దేశవాళీ వినోదం బాగా పండించింది.
అయితే ఈ సినిమా సామాన్య ప్రజానీకంతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చిందట. ఈ సినిమా తనకి బాగా నచ్చడంతో పవన్ స్వయంగా ఒక ఫ్లవర్ బోకేను చిత్ర హీరో శ్రీనివాస్ రెడ్డికి పంపించాడు.
ఈ ఊహించని గిఫ్ట్ తో మొత్తం టీం ఆనందంలో మునిగిపోయింది. ఇక శ్రీనివాస్ రెడ్డి పవన్ పంపిన ఫ్లవర్ బోకే ని తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశాడు.
మొత్తానికి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకి పవర్ స్టార్ కూడా అభిమాని అయిపోయాడు..