'కాలా' వసూళ్లు కొల్లగొట్టేస్తోందిలా.!

మరిన్ని వార్తలు

మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా 'కాలా' వసూళ్లు బాగానే కొల్లగొడుతోంది. ఈ మధ్య రజనీకాంత్‌ నుండి వచ్చిన సినిమాల్లో 'కాలా'కు చెప్పుకోదగ్గ మార్కులు పడుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా 'కాలా' వసూళ్లు కొల్లగొడుతోంది. ఫస్ట్‌డే కన్నా సెకండ్‌ డే ఇంపాక్ట్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అక్కడి ట్రేడ్‌ పండితులు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ 'కాలా' వసూళ్లతో బాక్సాఫీస్‌ కళ కళలాడుతోంది. టాక్‌తో సంబంధం లేకుండా, సూపర్‌స్టార్‌ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. 'కబాలి'తో నిరాశపరిచన డైరెక్టర్‌ పా రంజిత్‌ తన మాట నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్‌స్టార్‌కి హిట్‌ ఇవ్వాలన్న ఆయన నమ్మకాన్ని నెరవేర్చుకున్నాడు. ధనుష్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. స్లమ్‌ ఏరియాని చాలా నేచురల్‌గా చూపించారనీ తెలుస్తోంది. తన స్టైల్‌తో సూపర్‌స్టార్‌ అభిమానుల్ని ఇదివరకటిలాగే ఆకట్టుకున్నాడు. 

ఇకపోతే నిన్న దేశ వ్యాప్తంగా విడుదలైన 'కాలా' సినిమాకు కర్ణాటకలో మాత్రం చుక్కెదురైంది. కొన్ని ధియేటర్స్‌లో 'కాలా' సినిమాని ఆందోళకారులు అడ్డుకోవడంతో, ప్రదర్శన నిలిపివేశారు. మరికొన్ని చోట్ల కాస్త ఆలస్యంగా 'కాలా' ప్రదర్శితమైంది. ఈ రోజు పూర్తి స్థాయిలో అక్కడ 'కాలా' విడుదల కానుంది. బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి కీలక పాత్ర పోషించగా, రజనీకాంత్‌ భార్య పాత్రలో ఈశ్వరీరావు కనిపించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS