సూపర్‌స్టార్‌ మొదలెట్టేశాడు.!

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కాలా' చిత్రం వరుస వాయిదాల పర్వం తర్వాత ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు రజనీకాంత్‌, కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'కాలా' రిలీజైన్‌ ఇదే రోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 

డార్జిలింగ్‌లో ఈ చిత్ర షూటింగ్‌ ఫస్ట్‌ షాట్‌ చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రంలో కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. సీనియర్‌ నటి సిమ్రన్‌, రజనీకాంత్‌కి జోడీగా నటిస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నారు. 

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన 'రోబో 2.0' చిత్రం విడుదల డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. ఈ సినిమా షూటింగ్‌ జరిగి ఎంతో కాలం గడిచినా, స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ నేపథ్యంలో ఆలస్యం అవుతూ వస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోంది 'రోబో 2.0'. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రమిది. కానీ ఏవో కారణాల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. 'కాలా' కన్నా ముందు విడుదల కావల్సిన 'రోబో 2.0'ను త్వరలోనే విడుదల చేస్తామని శంకర్‌ అండ్‌ టీమ్‌ చెబుతున్న తాజా సమాచారమ్‌. 

చూడాలి మరి, ప్రపంచం మొత్తం 'రోబో 2.0' కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. 'కబాలి' సినిమా విషయంలో చాలా హైప్‌ క్రియేట్‌ చేశారు. కానీ 'కాలా'ని సాదాసీదాగా విడుదల చేసేశారు. మరి 'రోబో 2.0' కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS