ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పిన రజిని అల్లుడు

మరిన్ని వార్తలు

అన్ని సజావుగా జరిగి ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రం తాలుకా టీజర్ విడుదలై ఇప్పటికి నాలుగు గంటలు అయి ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టీజర్ విడుదలకాలేదు. 

ఈ ఆకస్మిక మార్పుకి చింతిస్తూ అలాగే ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులని నిరాశ పరిచినందుకు కాలా టీం తరపున ఆ చిత్ర నిర్మాత, రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ అందరిని క్షమాపణ కోరాడు. 

అయితే టీజర్ విడుదల చేయకపోవడానికి కారణం- నిన్న కంచి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ఈలోకం విడవడంతో దానికి సంతాప సూచకంగా ఈ టీజర్ విడుదల వాయిదా వేశారు. ఇక ఈ టీజర్ ని రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

మొత్తానికి ఒక రోజు ఆలస్యంగా ఈ టీజర్ విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS