Kabzaa: 'క‌బ్జా'... ఇది క‌దా అస‌లైన 'డ‌బ్బా'

మరిన్ని వార్తలు

ఈ వారం విడుద‌లైన సినిమాల్లో 'క‌బ్జ' ఒక‌టి. ఉపేంద్ర న‌టించిన సినిమా ఇది. భారీ ఎత్తున తీశారు. పాన్ ఇండియా స్థాయిలో వ‌దిలారు. ఉపేంద్ర కెరీర్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే. క‌న్న‌డ నాట ఈ సినిమా కొత్త రికార్డులు కొడుతుంద‌ని, మ‌రో కేజీఎఫ్ అవుతుంద‌ని అంతా ఆశించారు. కానీ తీరా చూస్తే సినిమా డిజాస్ట‌ర్‌. కేజీఎఫ్‌కి కాపీలా ఉంద‌ని జ‌నాలు మొత్తుకొన్నారు. సినిమా చెత్త‌గా ఉంద‌ని రివ్యూలూ తేల్చేశాయి. దానికి త‌గ్గ‌ట్టే వ‌సూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. క‌న్న‌డ‌లో ఉపేంద్ర ఫ్యాన్స్ త‌ప్ప ఇంకెవ్వ‌రూ ఈ సినిమా చూడ‌లేదు. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట‌ర్ల‌లో జ‌నాల్లేక ఈగ‌లు తోలుకొంటున్నారంతా. అయితే.. ఈ చిత్ర‌బృందం ఈ సినిమా రూ.100 కోట్లు సాధించిన‌ట్టు ఓ పోస్ట‌ర్ డిజైన్ చేసి వ‌దిలింది. అది చూసి జ‌నాలు ఆశ్చ‌ర్యపోతున్నారు. ఈ సినిమా రూ.100 కోట్లు ఎలా కొట్టేసింద‌ని, ఇదంతా డ‌బ్బా న్యూస్ అంటూ కొట్టి పారేస్తున్నారు ట్రేడ్ వ‌ర్గాలు.

 

రెండు రోజుల్లో క‌న్న‌డ‌నాట దాదాపుగా రూ.15 కోట్లు తెచ్చుకొంది ఈ సినిమా. ఈ సినిమాకి వ‌చ్చిన టాక్‌కి అదే ఎక్కువ‌. కానీ.. చిత్ర బృందం మాత్రం కాకి లెక్క‌ల‌తో రూ.100 కోట్లు సాధించింద‌ని స్టేట్ మెంట్లు గుప్పిస్తూ.. పోస్ట‌ర్లు వ‌దులుతోంది. క‌న్న‌డ నాట కూడా ఈ ఫేక్ వార్త‌ల‌తో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా య‌శ్‌, రిష‌బ్ శెట్టి ఫ్యాన్స్ అయితే క‌బ్జ సినిమాని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా న‌యం.. కేజీఎఫ్‌, కాంతార రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టేసింద‌ని చెప్ప‌లేక పోయారా? అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఆల్రెడీ సినిమా ఫ్లాపుతో... ఉపేంద్ర డ‌ల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ తో త‌న‌కు కొత్త త‌ల‌నొప్పి చుట్టుకొన్న‌ట్టు అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS