దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నవరస నటసార్వభౌముడికి తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. కైకాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు కైకాల. తన 24 ఏళ్ల వయసులో చలనచిత్రరంగ ప్రవేశం చేసి.. అత్యధికంగా ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. విలనిజం, కరుణ, హాస్యరస ప్రధానమైన పాత్రలనూ అవలీలగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘సిపాయి కూతురు’. మహేశ్‌బాబు కథానాయకుడిగా రూపొందిన ‘మహర్షి’ సినిమా తర్వాత ఆయన సినిమాలకి దూరంగా వున్నారు. ఆయన మరణంతో పాత కొత్త తరాలకు ఒక వారధి వెళ్ళిపోయినట్లయింది.