Ravi Teja: డిజాస్ట‌ర్ స్టార్ ఆఫ్ ది ఇయ‌ర్‌..!

మరిన్ని వార్తలు

ఇది వ‌ర‌కు ర‌వితేజ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. సినిమా కాస్త అటూ ఇటూగా ఉన్నా, నిర్మాత‌ల‌కు లాభాలొచ్చేసేవి. ప్రేక్ష‌కుల‌కీ టికెట్ రేటు గిట్టుబాటు అయ్యేది. కొంత‌కాలంగా ర‌వితేజ‌కు హిట్లు లేవు. అన్నీ డిజాస్ట‌ర్లే. క్రాక్ తో కాస్త ఊపిరి పీల్చుకొన్నాడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ప‌రాజ‌యాల ప‌రంప‌ర మొద‌లైపోయింది. 2022 అయితే ర‌వితేజ‌కు అస్స‌లు క‌ల‌సి రాలేదు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలూ ఫ్లాప్ అయిపోయాయి. వాటికి క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల‌తో వ‌చ్చిన `ధ‌మాకా`దీ అదే రిపోర్ట్‌. ఈసారి కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మెప్పించ‌లేక‌పోయాడు ర‌వితేజ‌. ఊర మాస్ కామెడీని న‌మ్ముకొని తీసిన రొటీన్‌ సినిమా అని విశ్లేష‌కులు తేల్చేశారు. దాంతో.. ఈ యేడాది రవితేజ ప‌రాజ‌యాల హ్యాట్రిక్ మూట‌గ‌ట్టుకోవాల్సివ‌చ్చింది.

 

కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నం ఏమిటంటే.. ధ‌మాకాకి ఓపెనింగ్ డే రోజున మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈమ‌ధ్య కాలంలో..ర‌వితేజ సినిమాల‌కు ఈమాత్రం ఓపెనింగ్స్ రావ‌డం ఇదే తొలిసారి. క్రిస్మ‌స్ సెల‌వ‌లు క‌లిసొస్తాయి కాబ‌ట్టి.. ఈ మూడు రోజులూ... `ధ‌మాకా`కి ఢోకా లేక‌పోవొచ్చు. కానీ... ర‌వితేజ సినిమాకి ఇది స‌రిపోదు. ఈ సినిమాపై దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టార‌ని టాక్‌. దాన్ని రాబ‌ట్టుకోవాలంటే క‌నీసం యావ‌రేజ్ మార్క్ ద‌గ్గ‌రైనా ఈ సినిమా ఆగాలి. అది దాదాపు అసాధ్యంలానే క‌నిపిస్తోంది. ఒకే యేడాది వ‌రుస‌గా మూడు ఫ్లాపులు ప‌డ‌డం ఏ హీరోకైనా ఇబ్బందే. మ‌రి ఈ బ్యాడ్ టైమ్ ని ర‌వితేజ ఎలా దాటుకొని వ‌స్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS