నేనే రాజు నేనే మంత్రి చిత్రం విజయవంతం కావడంలో రానా ఎంత కీలకమో కాజల్ అగర్వాల్ పాత్ర కూడా అంతే అనేది నిర్వివాదాంశం.
ఇక భార్యాభర్తలుగా వీరిరువురి నటన ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ అని కచ్చితంగా చెప్పొచ్చు. వీరి మధ్య వచ్చే సన్నివేశాల్లో వీరు కనబరిచిన అభినయానికి ఈ ఇద్దరి మధ్యలో ఏదో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి.
అయితే ఇవి కేవలం పుకార్లే అని తమ మధ్య స్నేహం తప్పించి మరేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ పుకార్ల పై రానా ఇంకా స్పందించాల్సి ఉంది.
కాకపోతే ఇప్పటికే రానకి పలువురు హీరోయిన్స్ తో చాలా లింకప్స్ లో ఆయన పేరు వచ్చింది. కాని వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదు అని తేలిపోయింది.