అదిరేటి డ్రస్సు చందమామ వేస్తే

మరిన్ని వార్తలు

అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లకు పోటీ ఇస్తూనే, ఎప్పుడూ వల్గారిటీ జోలికి వెళ్ళని అతి కొద్దిమంది ముద్దుగుమ్మల్లో కాజల్‌ అగర్వాల్‌ పేరు ఖచ్చితంగా ఉంటుంది. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందినా, అవకాశాలు తగ్గాయనీ, కెరీర్‌ స్లో అయ్యిందనీ కామెంట్స్‌ ఎదుర్కొన్నా, కాజల్‌ మాత్రం ఎప్పటికప్పుడు బౌన్స్‌ బ్యాక్‌ అవుతూనే ఉంది. అందంలో కాజల్‌ అగర్వాల్‌ అచ్చంగా చందమామే. అభినయంలోనూ తనదైన ముద్ర వేసింది చాలా సినిమాలతో. అలాంటి కాజల్‌ ఇదిగో ఇలా ఒకింత డోస్‌ పెంచిన హాట్‌నెస్‌తో క్యూట్‌ క్యూట్‌గా దర్శనమిచ్చింది. క్యాలెండర్స్‌ కోసం ముద్దుగుమ్మలు ఇన్నోవేటివ్‌గా తమ తమ అందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఓ క్యాలెండర్‌ కోసం కాజల్‌ బ్యూటీ ఇలా తనలోని గ్లామర్‌ యాంగిల్‌ని తెరిచి పెట్టింది. స్కిన్‌ కలర్‌లో చెమ్కీలు పొదిగి, ఒంటికి అతుక్కుపోయినట్లుగా ఉన్న ఈ డ్రస్సులో కాజల్‌ అందం అదరహో అనిపించడం లేదూ! ప్రస్తుతం కాజల్‌ 'క్వీన్‌' తమిళ రీమేక్‌లోనూ, తెలుగులో కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలోనూ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS