డబ్బింగ్ సినిమా అయినా 'బిచ్చగాడు' సినిమా తెలుగులో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది 'బిచ్చగాడు'. వసూళ్లతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి కోసం కోటీశ్వరుడైన కొడుకు బిచ్చగాడుగా ఎలా మారాడన్న కథాంశాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు ఈ సినిమాలో. విజయ్ ఆంటోనీ, సాట్నా టైటస్ జంటగా తెరకెక్కింది ఈ చిత్రం.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ సాట్నా సైటస్ ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తోంది. అందంలోనూ, అభినయంతోనూ ఆకట్టుకుందీ భామ 'బిచ్చగాడు'లో. అయితే 'బిచ్చగాడు' తర్వాత ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. పెళ్లంటే మామూలుగా జరగలేదులెండి. ఇంతకీ ఈ అందాల భామ పరిణయమాడింది ఎవరో తెలుసా? 'బిచ్చగాడు' తమిళ డిస్ట్రిబ్యూటర్ కార్తిని. ఈ పెళ్లి టైంలో చాలా వివాదాలను ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లింది వీరి పెళ్లి తతంగం. తమ కూతురు సినీ కెరీర్ని నాశనం చేస్తున్నాడంటూ కార్తిపై సాట్నా తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించననీ సాట్నా కూడా తేల్చి చెప్పేసిందిలెండి. కానీ, ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలి కాబట్టి, ముందుగానే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. ఆ కోవలోనే తమిళంలో ఓ సినిమాలోనూ, తెలుగులో ఓ సినిమాలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ సాట్నా టైటస్. అదీ సంగతి.