కరోనా వైరస్ నేపథ్యంలో హీరోయిన్లు కిచెన్ క్వీన్స్‌గా మారిపోతున్నారు. హీరోలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. దర్శక నిర్మాతలూ గరిటె పట్టేసి.. అద్భుతమైన వంటకాలతో అభిమానుల్ని సోషల్ మీడియా వేదికగా అలరిస్తున్నారు. ఎంతైనా హీరోయిన్లు చేసే వంటకాలకు లభించే ఫాలోయింగే వేరు. పైగా, సోషల్ మీడియాలో బోల్డంతమంది ఫాలోవర్స్ వున్న కాజల్ అగర్వాల్ కిచెన్ క్వీన్‌గా మారిపోయి వంటకాలతో కను విందు చేసేస్తోంటే.. అభిమానులు వాటిని ఆస్వాదించకుండా వుండగలరా.? వెండితెరపై అందాల ఆరబోత కంటే ఎక్కువగా ఈ వంటల విందు అభిమానుల్ని అలరించేస్తుండడం గమనార్హం.
తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇంట్లో సమోసాలు చేసింది. ఇఫ్పుడు ఈ సమోసాల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాజల్ తరహాలోనే సమోసాలు తయారు చేసేస్తూ, వాటికి ‘కాజల్ సమోసా’ అంటూ పేరు పెట్టేస్తున్నారు ఆమె అభిమానులు. స్వీయ క్వారంటైన్.. ఇలా అందాల భామల్లోని కొత్త కొత్త టాలెంట్స్‌ని బయటకు తీస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. సినిమాల విషయానికొస్తే, కాజల్ అగర్వాల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్న విషయం విదితమే. మంచు విష్ణు నిర్మిస్తోన్న ‘మోసగాళ్ళు’ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది కాజల్. అయితే, కోరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయ్.