ఇటీవల గౌతమ్ అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తరవాత హనీమూన్ కూడా ఎంజాయ్ చేసింది. కాజల్ జోరు చూసి - సినిమాలకు దూరం అయిపోయి, సంసార జీవితంలో మునిగిపోతుందేమో అనుకున్నారంతా. పెళ్లయ్యాక హీరోయిన్ల కెరీర్ ఎలాగూ డల్ అయిపోతుంది కూడా. కానీ... కాజల్ విషయంలో రివర్స్ గేర్ లో వెళ్తోంది బండి. పెళ్లయ్యాక కాజల్ మరింత బిజీ అయ్యింది. `ఆచార్య`లో కథానాయికగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈమధ్యే ఓ వెబ్ సిరీస్‌కూడా చేసింది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన లేడీ ఓరియెండెట్ కథకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాకి సంతకం చేసింది. యాడ్ ఫిల్మ్ మేకర్ సిన్హా... కాజల్ కోసం ఓ కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథని రాసుకున్నాడు. ఇటీవలే కాజల్ తో భేటీ కూడా జరిగింది. ఈ కథ కాజల్ కి నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.
ఈసినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయిపోయింది. ఈ సినిమాలో కాజల్ `ఉమ` అనే పాత్రలో కనిపించబోతోంది. మరి ఆ పాత్ర ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.