అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్ వున్నారు. అత్యధికంగా ఫాలోవర్స్ వున్న హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. తన అభిమానులకు నిత్యం సోషల్ మీడియా ద్వారా టచ్‌లో వుండే కాజల్ అగర్వాల్, అప్పుడప్పుడూ హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంటుంది. తన మీద గాసిప్స్ వచ్చినప్పుడు ఖండిస్తూ వుంటుంది కూడా. అసలు విషయానికొస్తే, ఈ బ్యూటీ ఇప్పుడు ఇంట్లోనే టైవ్‌ు పాస్ చేయాల్సి వస్తోంది. కాజల్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఇంట్లోనే కాలక్షేపం చేయాలి. ఎందుకంటే, పరిస్థితి అలాంటిది. కోవిడ్ వైరస్ ఇప్పుడు అందర్నీ ఇంట్లో కూర్చోబెట్టేసింది మరి. ఖాళీగా కూర్చుంటే, లావైపోతాం కదా.! అందుకే, కాజల్ అగర్వాల్ ఇంట్లో కూడా ఖాళీగా కూర్చోవడంలేదు.. ఇళ్ళంతా కలియ తిరిగేస్తోంది. వున్న ఆ కాస్త ప్లేస్‌నీ సద్వినియోగం చేసుకోవాలంటోంది.
తన తండ్రితో కలిసి ‘కార్డియో’ ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తోంది.. అదేనండీ నడవడం. మొన్నీమధ్యనే, చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో చెబుతూ కాజల్ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం విదితమే. దాంతోపాటుగా తాను చేస్తున్న సినిమాలు, ఇతరత్రా విషయాలు కూడా అభిమానులతో పంచుకుంది. అన్నట్టు, ఈ బ్యూటీ తాజాగా బుల్లితెరపై వస్తోన్న అలనాటి ‘రామాయణ్’ ధారావాహికను వీక్షిస్తోందట. చిన్నప్పటి రోజులు తనకు గుర్తుకొచ్చాయని చెబుతోంది ఈ సీరియల్ చూడ్డం ద్వారా.