దర్శకుడు హరీష్ శంకర్ తనను తాను ‘నాటకాల రాయుడు’గా అభివర్ణించుకున్నాడు. అయితే, ఇది ఆయనకు ఆయన సన్నిహితులు ఇచ్చిన బిరుదు లాంటిదట. చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్‌లో వేసిన ‘నాటకం’ తాలూకు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు హరీష్ శంకర్. ఈ సందర్భంగా హరీష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నాటక రంగం గురించి. ‘సినిమా జీవితాన్ని పెద్దగా చూపిస్తుంది.. టీవీ జీవితాన్ని చిన్నగా చూపిస్తుంది.. జీవితాన్ని జీవితంలా చూపించేది రంగస్థలం ఒక్కటే.. ఒక మహానుభావుడు... కళాకారులందరికీ.. ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు.. నాటకాల రాయుడు అని పిలిపించుకునే రోజుల్లో నేను..’ అంటూ ఫొటోల్ని షేర్ చేశాడు హరీష్ శంకర్.
చిన్నప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ అభిమాని కాబోలు.. అందుకే, హరీష్‌లో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, స్టయిల్ కన్పిస్తోంది. అన్నట్టు, పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ త్వరలో ఓ సినిమా చేయనున్న విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించనుంది. గతంలో పవన్ - హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా రావడం, అది సంచలన విజయాన్ని అందుకోవడం తెల్సిన విషయమే. ఏది ఏమైనా, స్టార్ డైరెక్టర్‌గా సినీ రంగంలో ఎదిగినా, నాటక రంగంపై హరీష్ శంకర్‌కి గౌరవం తగ్గకపోవడం అభినందించదగ్గ విశేషమే కదా.