కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న వేళ, ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే, ఇంట్లోనే ఉంటే టైమ్ పాస్ ఎలా.? ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 21 రోజులు. ఆ పై కూడా. అందుకే సెబ్రిటీలు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. కరోనా కట్టడికి గవర్నమెంట్లు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ, తమ వంతు సాయమందిస్తుండగా, ఇంకొందరు ఇంట్లోనే ఉంటూ బోర్ ఫీలవుతున్న జనానికి సోషల్ మీడియా ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నారు. ఇది కూడా సామాజిక సేవలో ఓ భాగమే కదా.
ఈ హాలీడేస్‌లో తాము చేస్తున్న కార్యకలాపాలను వీడియోల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో తెలుసా.? కలరియా పట్టు నేర్చుకుంటోంది. ఆమె నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో ఈ విద్యకు సంబంధించిన ప్రస్థావన ఉంది. అందు కోసం ఈ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవల్సి వచ్చింది కాజల్‌కి. అయితే, ఇప్పుడు కరోనా హాలీడేస్‌తో దీన్ని ప్రొఫిషనల్‌గా నేర్చేసుకుంటోందట కాజల్. ఏదో సినిమా కోసమే అన్నట్లుగా కాకుండా, ఆరోగ్యపరంగానూ ఈ శిక్షణ తోడ్పడుతుందని చెబుతోంది. ఫిట్‌నెస్‌ని పెంచేందుకు, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందట. కొన్ని వీడియోలను చూసి, ఈ విద్యలో శిక్షణ తీసుకుంటోంది మన అందాల చందమామ కాజల్ అగర్వాల్.