పెళ్లయ్యాక కాజల్ సినిమాలకు మెల్లమెల్లగా దూరం అవుతుందనుకున్నారంతా. కానీ.... ఆ ఉద్దేశ్యాలేం కాజల్ కు లేనట్టు అర్థమవుతోంది. ఎందుకంటే.. తను ఇప్పటికీ కొత్త కథలు వింటోంది. సినిమాలు ఒప్పుకుంటోంది. పైగా ఇప్పుడు ఓటీటీ ప్రవాహం ఎక్కువైంది. అటు సినిమా ఇటు ఓటీటీ అంటూ కాజల్ కూడా రెండు పడవల ప్రయాణం చేస్తోంది. తాజాగా కాజల్ ఓ కొత్త సినిమా ఒప్పుకున్నట్టు టాక్. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా.
`పేపర్ బోయ్` దర్శకుడు జయ శంకర్ కాజల్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. ఇటీవల ఆమెకు వినిపించేశాడు కూడా. ఈ కథ కాజల్ కి బాగా నచ్చిందట. దాంతో.. ఈసినిమా చేయడానికి తన అంగీకారం తెలిపిందని సమాచారం. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే సారి తెరకెక్కిస్తార్ట. మరోవైపు `ఆచార్య`లోనూ కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.