మేడమ్ టుస్సాడ్స్‌లో చందమామ కాజల్ అగర్వాల్ వేక్స్ బొమ్మకు ఆ మధ్య కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. వేక్స్ మెరుపుల్లో చందమామ అందంగా సిద్ధమైపోయింది. తన వేక్స్ బొమ్మతో కలిసి కాజల్ అగర్వాల్ ఆనందంగా దిగిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. చెమ్కీలు పొదిగిన అందమైన చీరలో కాజల్ వేక్స్ బొమ్మను రూపొందించారు. అందమైన ఖజురహో శిల్పంలా కనిపిస్తున్న ఈ బొమ్మతో కలిసి కాజల్ తన కుటుంబ సమేతంగా ఫోటోలకు పోజులిచ్చింది. తల్లీ, తండ్రీతో పాటు, చెల్లెలు నిషా ఆగర్వాల్ ఆమె భర్త, కొడుకు కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు. పింక్ కలర్ మోడ్రన్ డ్రస్‌లో కాజల్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా కొత్త ప్రాజెక్టులు సైన్ చేసిన దాఖలాల్లేవ్ కానీ, తమిళంలో కాజల్ నటించిన 'ప్యారిస్ ప్యారిస్' మూవీ రిలీజ్ కావల్సి ఉంది. బాలీవుడ్ 'క్వీన్'కి తమిళ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ, ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకోవడం లేదెందుకో. మరోవైపు కొన్ని వెబ్ సిరీస్‌లోనూ కాజల్ నటిస్తోంది. మంచు విష్ణు నిర్మాణంలో 'కాల్ సెంటర్' అనే ఓ వెబ్ సిరీస్‌లో కాజల్ నటిస్తోంది.