మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' ఫస్ట్ వేవ్ రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లోనూ అదే సస్పెన్స్. టైటిల్ లుక్‌లోనూ అదే సస్పెన్స్. ఫస్ట్ వేవ్ అంటూ రిలీజ్ చేసిన తాజా వీడియోలోనూ ఒకటే సస్పెన్స్. ఇంతవరకూ సినిమాకి సంబంధించి అంతా సస్పెన్స్‌గానే ఉంచారు. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ఆలోచన ఇప్పటికైనా గట్టిగా తలపెట్టాల్సిన అవసరముందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రమోషన్ లేకుంటే, సినిమాలు బతికి బట్ట కట్టడమన్నది కల. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే.. అలాంటిది డెబ్యూ హీరో సినిమాని ఇంకెంత జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ, 'ఉప్పెన' విషయంలో ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారెందుకో. 'అల..' సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం సినిమా ప్రమోషన్సే. నాలుగు నెలల ముందు నుండే జనం నోళ్లలో నానేలా చేశారు. దాంతో సినిమాకి జనం బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సక్సెస్ ఫార్ములాని చూసి కూడా 'ఉప్పెన' టీమ్ సైలెన్స్ వీడడం లేదెందుకో.
తాజాగా రిలీజైన 'ఉప్పెన' వేవ్ విషయానికొస్తే, ఫస్ట్‌లుక్‌లో హీరోని ఎలా అయితే చూపించారో వెనక నుండి అలాగే, అక్కడే చూపించారు ఇందులో కూడా. అయితే ఈ సారి ఆడియో వినిపించారు. సముద్రాన్ని చూసి గట్టిగా అరుస్తున్నాడు హీరో. ఆ తర్వాత ప్లజెంట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌లో బస్సులో వెళుతూ, ఎగురుతున్న చున్నీ మధ్యలోంచి హీరోయిన్ ఫేస్‌ని కనీ కనిపించకుండా చూపించారు. అంతే ఈ వేవ్ ముచ్చట. సుకుమార్ రైటింగ్స్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకుడు. కృతీ శెట్టి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.