చందమామ అంటే చల్లదనం. కానీ మన చందమామ బ్యూటీ మాత్రం సెగలు పుట్టించేస్తోంది తన హాట్ హాట్ గ్లామర్‌తో. లేటెస్టుగా ఓ అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరైన కాజల్ అగర్వాల్ బ్లాక్ చెమ్కీ డ్రస్సులో మెరుపులు మెరిపించింది. మామూలు మెరపులా అవి. అయ్యబాబోయ్ కాజల్ మరీ ఇంత హాట్‌గానా? అనిపించేలా ఉన్నాయి మరి. దశాబ్దానికి పైగా టాలీవుడ్లో గ్లామర్ తారగా వెలుగొందుతోంది కాజల్. ఎక్కడా ఎప్పుడూ కాజల్ ఫేడ్ అయిపోయిందన్న మాటే లేదు ఇన్నాళ్ల కెరీర్లో, అంతకంతకూ గ్లామర్ పెరుగుతోందే కానీ తరిగిపోవడం లేదు. ఈ మధ్య కాజల్ గ్లామర్ డోస్ మరీ పెంచేసింది. యంగ్ హీరోస్తో జత కడుతోన్న నేపథ్యంలో కాజల్ అందంలో మరింత ఫ్రెష్‌నెస్ యాడ్ అయ్యింది. అందుకే అప్‌కమింగ్ హీరోయిన్స్ కాజల్ అందంతో పోటీ పడలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఇటీవలే కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కాజల్ ప్రస్తుతం బాలీవుడ్ 'క్వీన్' సినిమాకి తమిళ రీమేక్ అయిన 'ప్యారిస్ ప్యారిస్'లో లీడ్ రోల్ పోషిస్తోంది.