ఆ విషయంలో కాజల్‌ వెనక్కి తగ్గిందా.?

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ మధ్య ఓ ప్రయోగం చేసింది. చిన్న అస్త్రాన్ని సంధించింది. అదే డీ గ్లామర్‌ లుక్‌. విత్‌ అవుట్‌ మేకప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. షాక్‌ ఏంటీ ఒకింత భయపెట్టిందనే చెప్పాలి. అయితే కాజల్‌ ఇలా ఎందుకు చేసిందో తెలుసా.? ఈ మధ్య కాజల్‌కి డీ గ్లామర్‌ టచ్‌తో ఉన్న స్టోరీలు వస్తున్నాయట. అలాంటి కథల్లో నటిస్తే తన ఇమేజ్‌ ఎలా ఉంటుందా.? అని జడ్జ్‌ చేసుకోలేకపోతున్నా కాజల్‌, జస్ట్‌ శాంపిల్‌గా ఆ ఫోటోలను పోస్ట్‌ చేసి, ఆడియన్స్‌ పోల్‌ నిర్వహించిందన్న మాట. అయితే, ఆ లుక్‌లో కాజల్‌ని తట్టుకోవడం కష్టమే అని రిజల్ట్‌ అందుకోవడంతో కాజల్‌ అటు వైపుగా ఆలోచనలు మానేసిందట. తనకు గ్లామర్‌ రోల్సే కలిసొస్తాయి, తప్ప డీగ్లామర్‌ తన ఒంటికి పడదని వెనక్కి తగ్గిపోయిందట.

 

ప్రస్తుతం కాజల్‌ చేతిలో పెద్దగా చేయాల్సిన ప్రాజెక్టులేమీ లేవు. తెలుగులో యంగ్‌హీరో శర్వానంద్‌తో 'రణరంగం' సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'కోమాలి' అనే మూవీ ఒకటుంది. జయం రవి ఈ సినిమాలో హీరో. కాగా, ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చేసుకున్న 'ప్యారిస్‌ ప్యారిస్‌' మాత్రం ఎందుకో విడుదలకు నోచుకోవడం లేదు. మరి ఈ తరుణంలో చందమామ ఏం చేస్తుందటా.. గ్లామర్‌కే మరింత పదును పెట్టి, గ్లామరస్‌ పాత్రల్నే ఎంచుకోవాలని చూస్తోందట. ఆ క్రమంలో స్పెషల్‌ సాంగ్స్‌కీ ప్రాధాన్యత ఇస్తోందట కాజల్‌ అగర్వాల్‌. లేటెస్ట్‌గా కాజల్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కి సై అన్నదంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇందులో నిజమెంతో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS