అద్దె పెళ్లాంగా... ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

మరిన్ని వార్తలు

ఇది వ‌ర‌కు అద్దెకు సైకిళ్లు, వీసీఆర్‌లూ, న‌వ‌ల్సూ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తి పూర్తిగా మారిపోయింది. అద్దె ఇల్లు త‌ప్ప - ఆ కాన్సెప్టే పూర్తిగా పోయింది. అయితే అద్దెకు భార్య‌లొస్తే ఎలా ఉంటుంది? - భ‌లే గ‌మ్మ‌త్తైన ఐడియా క‌దూ. అయితే.. నిజ జీవితంలో ఇలాంటివి చెల్లుతాయో లేదో గానీ - సినీ జీవితంలో మాత్రం వ‌ర్క‌వుట్ అయ్యే ఐడియానే ఇది. ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా అద్దె పెళ్లాంగా మారిపోతోంది. `మ‌న్మ‌థుడు 2` కోసం. నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. ర‌కుల్ క‌థానాయిక‌. ఇటీవ‌లే టీజ‌ర్ విడుదలైంది. టీజ‌ర్లో నాగ్‌ని ప్లే బాయ్ గా చూపించాడు ద‌ర్అకుడు. క‌థానాయిక పాత్ర‌ని మాత్రం దాచేశాడు.

 

ర‌కుల్ ఒక్క ఫ్రేములోనూ లేదు. కాక‌పోతే.. ఇందులో క‌థానాయిక పాత్ర కి సంబంధించిన ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ర‌కుల్ అద్దె పెళ్లాంగా న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. నాగ్ కి పెళ్లంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. కానీ ఇంట్లోవాళ్ల పోరు భ‌రించ‌లేక - పెళ్లి చేసుకోవాల్సివ‌స్తుంది. వాళ్ల‌ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి ఓ అద్దె పెళ్లాంని తీసుకొస్తాడు. ఆ పాత్ర‌లో ర‌కుల్ క‌నిపించ‌బోతోంది. అదీ మేట‌రు. ర‌కుల్ - నాగ్ మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింద‌ని, ఇదివ‌ర‌క‌టి సినిమాల‌కంటే ర‌కుల్ ఇందులో గ్లామ‌ర్‌గా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS