తెలుగులో కాజల్ పనైపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖైది నెం.150 తరవాత కాజల్ మరో సినిమా ఒప్పుకోలేదు. తేజ - రానా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మినహాయిస్తే కాజల్ చేతిలో సినిమా ఏం లేదు. అయినా సరే.. కాజల్ పారితోషికం విషయంలో రాజీ పడడం లేదని, కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎం.ఎల్.ఏ. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్‌ని సంప్రదించార్ట. కల్యాణ్ రామ్ సరసన నటించడానికి ఒప్పుకొన్న కాజల్, అందుకోసం 1.75 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. దాంతో కాజల్‌కి ఇంత డిమాండ్ ఉందా? అంటూ దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నార్ట. సినిమాల్లేనప్పుడు పారితోషికం తగ్గిస్తూ... ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటారు కథానాయికలు. కానీ కాజల్ మాత్రం వెరైటీగా పారితోషికం పెంచుకొంటూ పోతోంది. దాని వెనుక ఉన్న మర్మమేమిటో..??