గ్లామ్‌షాట్‌: కాజల్‌ ది స్టైల్‌ ఐకాన్!

మరిన్ని వార్తలు

చందమామ అందానికి కవుల వర్ణన సరిపోదు. మనం మాట్లాడుకునేది ఆ నింగిలోని చందమామ కోసం కాదు, నేలపైన సినీ వినీల కొలనులో విరిసిన అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ గురించి. దశాబ్ధ కాలానికి పైగానే సినీ కొలనును ఏలుతోన్న ముద్దుగుమ్మ ఈ చందమామ. ఎందరో స్టార్‌ హీరోయిన్లు నెంబన్‌ వన్‌ ఛైర్‌ని అధిరోహింంచేందుకు ఎగబడి మరీ పోటీ పడ్డారు. కానీ చందమామ మాత్రం నిదానమే ప్రధానమంటూ నిదానంగా తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఎప్పుడూ ఎగ్రెసివ్‌గా బిహేవ్‌ చేయలేదు. ఏ విషయంలోనూ హద్దులు దాటలేదు. అదే ఆటిట్యూడ్‌ ఆమెని ఇన్నాళ్లుగా స్టార్‌ హీరోయిన్‌ హోదాలో ఉంచుతోందేమో.

 

ఇక గ్లామర్‌ విషయానికి వస్తే, వయసుతో పాటు గ్లామర్‌ కూడా అంచెలంచెలుగా పెరుగుతోంది కాజల్‌కి. ప్రేమ, పెళ్లి వంటి వదంతులను దరి చేరనీయకుండా, అభిమానులను మరింత ఎంటర్‌టైన్‌ చేయడమే తన వంతు అంటూ కెరీర్‌ని చక్కగా బిల్డప్‌ చేసుకుంటోంది. ప్రస్తుతం 'సీత' అంటూ తనలోని డిఫరెంట్‌ యాంగిల్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో.

 

మరోవైపు తమిళంలో 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంతో పాటు, మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కాజల్‌ కరెక్ట్‌గా కెరీర్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వస్తోంది. ఎంత బిజీగా ఉన్నా, ఈ మధ్య సోషల్‌ మీడియాలో కాజల్‌ యాక్టివ్‌గా కనిపిస్తోంది. తాజా తాజా పిక్స్‌ని అప్‌లోడ్‌ చేస్తూ, ఫాన్స్‌కి గ్లామర్‌ విందు వడ్డిస్తోంది. తాజాగా కాజల్‌ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌కి, సపోటా కలర్‌ డిఫరెంట్‌ బోటమ్‌తో సరికొత్త స్టైల్‌ తీసుకొచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS