'అర్జున్‌ సురవరం'కి హ్యాపీ ల్యాండింగ్‌!

మరిన్ని వార్తలు

హాలీవుడ్‌ మూవీ 'అవెంజర్స్‌' పేరు చెప్పి నిఖిల్‌ సినిమా 'అర్జున్‌ సురవరం'కి తీరని అన్యాయం జరిగింది. అయితేనేం 'మహర్షి' టాక్‌ అటూ ఇటూ ఉండడంతో నిఖిల్‌ సినిమాకి స్లాట్‌ దొరికేసింది. మే 1న విడుదల కావాల్సిన 'అర్జున్‌ సురవరం' అప్పుడు మిస్‌ అయినా, ఇప్పుడు మంచి ఛాన్సే కొట్టేసింది. మే 17కు డేట్‌ ఫిక్స్‌ చేసుకుని, దర్జాగా ల్యాండింగ్‌కి రెడీ అవుతోంది. ఇంత కాదు అంత అనుకున్న 'మహర్షి' రిజల్ట్‌ అంతంత మాత్రమే కావడంతో యంగ్‌ హీరో నిఖిల్‌కి అది కలిసొచ్చే అంశమే అయ్యింది.

 

కంటెంట్‌ పరంగా నిఖిల్‌ 'అర్జున్‌ సురవరం'పై మొదట్నుంచీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్‌ మరిన్ని రెట్లు పెరిగింది. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో ఓ సోషల్‌ కాజ్‌తో రూపొందిన సినిమా ఇది. అందులోనూ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ అంశాలూ సినిమాకి మరో ప్లస్‌. దాంతో నిఖిల్‌ ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదనిపిస్తోంది. పవర్‌ఫుల్‌ జర్నలిస్టు పాత్రలో నిఖిల్‌ నటిస్తున్నాడు ఈ సినిమాలో.

 

లావణ్య త్రిపాఠి నిఖిల్‌తో జత కట్టింది. ఇదిలా ఉంటే, ఇదే రోజు మరో యంగ్‌ హీరో కూడా దూసుకొస్తున్నాడు. ఆయనే అల్లు శిరీష్‌. చాలా గ్యాప్‌ తర్వాత అల్లు శిరీష్‌ 'ఏబీసీడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నిఖిల్‌తో పోటీ అయినా కానీ, కూల్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో శిరీష్‌కి, నిఖిల్‌ సినిమాతో పెద్దగా వచ్చిన కష్టమేమీ లేదు. ఏ జోనర్‌ మెచ్చినవారు ఆ జోనర్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తారు. మొత్తానికి ఈ ఇద్దరు యంగ్‌ హీరోలైనా బాక్సాఫీస్‌కి కాసుల పంట పండిస్తారేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS