అదేంటో మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్‌మెంట్ అంటే ముద్దుగుమ్మలు పిచ్చెక్కిపోతుంటారు. బికినీలు ధరించి తెగ మురిసిపోతుంటారు. చక్కనమ్మల బికినీ అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మాల్దీవులను మన కాజు పాప కూడా ఓ సారి చుట్టేసింది. వెకేషన్స్‌ని ఎంజాయ్ చేయడంలో మన కాజు పాప టాప్‌లో ఉంటుంది. వెకేషన్స్‌కి వెళ్లడం ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే, కాజల్‌కి మరీ ఇష్టమట. ప్రస్తుతం షూటింగ్ నుండి కాస్త టైమ్ దొరికినట్లుంది. తన అందాలతో మాల్దీవుల అందాల్ని మరింత అందంగా మార్చేసింది.
బికినీ ధరించి అక్కడి ఓ బీచ్‌లో వయ్యారాలు పోయింది. గ్లామర్‌గా కనిపించడం ఓకే. కానీ, బికినీల్లో కాజల్ కనిపించింది చాలా తక్కువే. అందుకే కాజల్ తాజా బికినీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయిప్పుడు. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన బికినీ ధరించి కాజల్ చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. బాతు బెలూన్‌లో కూర్చొని స్విమ్మింగ్ పూల్ స్వైర విహారం చేస్తూ, కాజల్ ఫోటోలకు తెగ పోజిచ్చేసింది. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేస్కోండి.