టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ‘ఆచార్య’ సినిమాకు ముద్దుగుమ్మ త్రిష హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. త్రిష హ్యాండివ్వడంతో ఆ ప్లేస్‌లో అనుష్క, కాజల్ తదితర పేర్లు వినిపించాయి. అయితే, కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్‌గా తెలుస్తోంది. జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం చాలా మంది సెబ్రిటీలు సోషల్ మీడియా లైవ్‌లో ఫ్యాన్స్ ముందుకొచ్చారు. అలా ఫ్యాన్స్‌తో ఛాట్ చేసిన చందమామ కాజల్ అగర్వాల్, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో ‘ఆచార్య’ విషయం కన్‌ఫామ్ చేసింది.
అదేంటో, ‘ఆచార్య’ విషయంలో అన్ని అనౌన్స్‌మెంట్స్ అలాగే జరిగిపోతున్నాయి. గతంలో ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు మాటల సందర్భంలో అనుకోకుండానే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ అనౌన్స్ చేసేయాల్సి వచ్చింది. ఇక అదే అధికారిక ప్రకటన అయిపోయింది. ఇప్పుడేమో, హీరోయిన్ కన్‌ఫామేషన్ ఇదిగో ఇలా కాజల్ వైపు నుండి అనౌన్స్ అయిపోయింది. ఏది ఏమైతేనేం, త్రిష హ్యాండివ్వడం కాజల్‌కి బాగా కలిసొచ్చింది. మెగాస్టార్‌తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌కి టెంపరర్లీ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.